-వరద ప్రభావిత ప్రాంతా అధికారులను ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్
-పులిచింతల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్
విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త :
పులిచింతల నుంచి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడం ద్వారా గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 4. 96 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదలడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబర్ గేట్ వద్ద ఏర్పాడిన సాంకేతిక సమస్యను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులతో కలసి కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 16వ నంబర్ గేట్ అమర్చేందుకు మరో సుమారు 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 5 మీటర్లకు నీటి మట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలపడం జరిగిందన్నారు. దీని మూలంగా కృష్ణా నదీలో 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. కృష్ణా నదిలో పెరుగుతున్న నీటి ప్రవాహన్ని దృష్టిలో వుంచుకుని ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయాతం చేయవద్దని కలెక్టర్ నివాస్ సూచించారు. పిల్లలు వృద్ధులను లోతట్టు ప్రాంతాలనుంచి తరలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. పశువులు, పడవలను జాగ్రత్త పరచుకోవాలన్నారు. పులిచింతల డ్యాం వద్ద గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఔట్ ఫ్లో 4,96,347 క్యూసెక్కులు వుండగా ఇఫ్లో 1,57,870 క్యూసెక్కులు ఉందన్నారు. అదేవిధంగా సాయంత్రం 4:00 గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 63,375 క్యూసెక్కులు వుండగా ఇన్ ఫ్లో 73,064 క్యూసెక్కులు వుందని వివరించారు. 15 గేట్లను 2 అడుగుల మేర, 55 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుందన్నారు.