Breaking News

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన పలువురు రాష్ట్ర మంత్రులు…

విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త :
పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని ) దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గేటు విరిగిపోయిన సంఘటనకు సంబంధించి ప్రాధమిక సమాచారాన్ని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 16 నంబరు గేటును ప్రాంతాన్ని వారు పరిశీలించారు. బుధవారం రాత్రి జరిగిన ఘటనపై వివరాలను సంబంధిత ఇంజనీర్లు వివరించారు. ఈ సందర్భంగా గేటు మరమ్మత్తులను యుద్ధ
ప్రాతిపదికన పూర్తి చేయడానికి తక్షణ చర్యలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పులిచింత ప్రాజెక్టు గేటు విరిగిపోయిన ప్రాంతంలో తక్షణ మరమ్మత్తులు చేపట్టేందుకు తీసుకున్న చర్యలను పులిచింతల ప్రాజెక్టు ఎస్ఇ రమేష్ బాబు మంత్రులకు వివరించారు. మరో వైపు వరద ఉదృతి తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రవాణా సమాచార శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య ఇంజనీర్లకు సూచించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను మరింత అప్రమత్తం చేయాలన్నారు. వీరి వెంట పులిచింతల ఎస్ఇ రమేష్ బాబు, ఇఇ శ్యామ్ ప్రసాద్ డిఇఇ సుధాకర్, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం… అభ్యున్నతి గురించే

-జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుంది -రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిస్తూ కూటమిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *