-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
-కైకలూరు ఏలూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ల నిర్మాణాలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు సకాలంలో మెటీరియల్ అందించడానికి కావలసిన చర్యలు గైకొన వలసినదిగా శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు జాయింట్ కలెక్టర్(హౌసింగ్)శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ ని కోరారు. గురువారం కైకలూరు లోని వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో నిర్మితమవుతున్న ఇళ్ళు పరిశీలించేందుకు విచ్చేసిన జేసీ తో ఎమ్మెల్యే కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా భూసేకరణ చేసిన విధానం, ఆరు అడుగులపైగా మట్టితో లెవిలింగ్ చేయించిన విధానం, లే అవుట్ స్థితిగతులు,ఇళ్ల నిర్మించడానికి మేస్త్రులను ఇతర జిల్లా లనుండి రప్పించి తక్కువ ఖర్చుతో ఇళ్ళు నిర్మించి ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం,మెస్త్రీలకు నివాసం కోసం వెయిస్తున్న తాత్కాలిక షెడ్లు,గురించి వివరించడంతో పాటుగా తన సొంత ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కరెంట్ లైన్ ఇవ్వడం తో పాటుగా హౌసింగ్ సిబ్బందికి సౌకర్యం గా ఉండేందుకు పంచాయితీ తరపున షెడ్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి వారిని ఈ సైటుకి అనుసంధానం గా 30 ఎకరాలు భూసేకరణకు ఒప్పించి దానిలో డంపింగ్ యార్డ్, మంచినీటి చెరువు, స్మశానం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జేసీ కి వివరించారు.
జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ మాట్లాడుతూ పేదలందరికి ఇళ్ళు నిర్మాణం లో శాసనసభ్యులు తీసుకుంటున్న శ్రద్దకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.లేవుట్ చేసిన విధానం,ఇళ్ళు నిర్మాణం జరుగుతున్న తీరు బాగుందని అన్నారు.జిల్లాలోనే అతి పెద్ద లే అవుట్ గా ఉన్న ఈ లే అవుట్ లో ఇసుక డంపింగ్ చేసుకోవడానికి స్టాక్ పాయింట్ ఏర్పాటు చెయ్యడానికి అలాగే మిగతా 3 మండలాల కేంద్రాల్లో ఇసుక స్టాక్ పాయింట్స్ పెట్టడానికి ప్రతిపాదనలు పంపవలసినదిగా హౌసింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో హౌసింగ్ డి.ఈ.ఈ ఆదినారాయణ, తాహశీల్దార్ సాయి కృష్ణ కుమారి, ఎంపీడీఓ వెంకటరత్నం, హౌసింగ్ ఏ.ఈ మూర్తి, ఆర్ డబ్ల్యూఎస్ ఏ.ఈ. నాగబాబు, ఉపాధిహామి పథకం ఏపీవో శరణ్, ఆర్.ఐ ప్రసాద్తదితరులు పాల్గొన్నారు.