అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వారి పదవీ కాలపరిమితిని మరో రెండేళ్ళు అనగా ఈనెల 26వ తేదీ నుండి 2023 ఆఘస్టు 25వ తేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈమేరకు రాష్ట్ర యువజన అభ్యుదయం,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 17,తేది 5-8-2021(జిఓ ఎంఎస్ సంఖ్య:17)ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం,అధికార భాషైన తెలుగును పరిపాలనలో ఇతోధికంగా ఉపయోగించడానికి తగు విధంగా చర్యలు చేపట్టేందుకు,పరిపాలనలో తెలుగు వాడుక ప్రగతి సమీక్షించి, ప్రభుత్వానికి తగు సూచనలు,సిఫార్సులు చేసేందుకు వీలుగా 1966వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం 5(1)వ విభాగాన్ని అనుసరించి,ప్రభుత్వం అధికార భాషా సంఘానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను అధ్యక్షునిగా నియమించగా ఆయన 2019 ఆగష్టు 26వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు.కాగా ఆయన పదవీ కాలం ఈనెల 25వ తేదీతో ముగియనుండగా ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను క్యాబినెట్ ర్యాంక్ హోదాలో మరో రెండేళ్ళు ఆపదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
Tags amaravathi
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …