అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్)కు జాతీయ అవార్డు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో కలిసి అవార్డు వివరాలు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు తెలియజేసారు. గవర్నెన్స్ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ రంగ సంస్ధగా ఏపీ సీడ్స్ ప్రత్యేక గుర్తింపు సాధించడాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. రైతులకు గ్రామస్ధాయిలో నిరాటంకంగా, సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి, ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకోవడంపై ఏపీ సీడ్స్ ఎండీని, సిబ్బందిని అభినందించి, మున్ముందు రైతుల కోసం మరింతగా సేవలందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
Tags amaravathi
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …