సచివాలయం ఆకస్మిక తనిఖీ… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్ర‌వారం ప్రకాష్ నగర్ నందలి 268 & 269 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *