విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ రెండోవ డిప్యూటీ మేయర్ గా ఆవుతు శ్రీశైలజా రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ భవనంలో ఆమె చాంబర్‌లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవదాయ ధర్మదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కరిమున్నీసా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పి.గౌతమ్ రెడ్డి చైర్మన్ ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ మధు శివరామకృష్ణ, కొండవీటి ఆకాడమీ చైర్మన్ నారాయణరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెలందుర్గ, దుర్గగుడి చైర్మన్ పైలా సొమినాయుడు, కృష్ణ జిల్లా గ్రంధాలయ చైర్ పర్సన్ టి.జమ్మల పూర్ణమ్మ, వైసీపీ ప్లార్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షలు బొప్పన భవకుమార్, పలువురు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు తదితరులు బాధ్యతలు స్వీకరించిన శ్రీశైలజా రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మట్లాడుతూ రాజకీయల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తోంది కేవలం వైఎస్సార్ సీపీనేని అన్నారు. అర్హలందరికీ ప్రభుత్వ పధకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు చేపడతామన్నారు.నగరాభివృద్దికి పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అధికారులు సిబ్బంది, ఉన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …