Breaking News

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేయిల్లెన్స్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్ ఆదేశానుసారంగా 26 జిల్లాల సర్వేయిల్లెన్స్ యూనిట్స్ సిబ్బంది కి, డాక్టర్ బి. సుబ్రమణ్యేశ్వరి, అదనపు సంచాలకులు, (డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్) వారి సమక్షంలో ఈరోజు విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ అకడమిక్ లాంజ్ లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేయిల్లెన్స్ ప్రోగ్రామ్ గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ లో వివరములు చేర్చుటకుగాను క్రొత్తగా వచ్చిన మార్పుల గురించి, ఎపిడెమిక్ అవుట్ బ్రేక్స్ వచ్చినపుడు ఖచ్చితమైన సమాచారం సేకరించుట, నివారణకు తీసుకోవలసిన చర్యలు, అదేవిధంగా జాతీయ ర్యాబిస్ వ్యాధి నివారణ కార్యక్రమం, జాతీయ పాము కాటు నివారణా కార్యక్రమం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ యన్ మల్లేశ్వరి, జాయింట్ డైరెక్టర్ – ఐడియస్పి, డాక్టర్ డి మోహన కృష్ణ స్టేట్ నోడల్ ఆఫీసర్ న్యూ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్, డాక్టర్ యం వి పద్మజ స్టేట్ హెల్త్ ఆఫీసర్ ఐ డి యస్ పి మరియుస్టేట్ సర్వేయిల్లెన్స్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *