కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు , అర్భికేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చెయ్యడం జరుగుతుందని జేసి(ఆసరా), కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీఓ పి. పద్మావతి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో గా బాధ్యత లను స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పి.పద్మావతి మాట్లాడుతూ, జిల్లాలోనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు లో డివిజిన్ ను ముందువరుసలో నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు. డివిజిన్ లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలకు గ్రౌండింగ్ ప్రక్రియ జరిగిందన్నారు. ఆయా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పద్మావతి తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము వంటి ముడి సరుకులు గొడౌన్ లలో ఎక్కడికక్కడ స్టాకు సేకరించి పెట్టుకోవడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అడుగులు వేస్తామని తెలిపారు. గురువారం సాయంత్రం ఆర్డీవోగా బాధ్యత లను స్వీకరించడం జరిగిందని ఆమె తెలియచేశారు. నూతనంగా ఇంఛార్జి ఆర్డీవోగా బాధ్యత లను స్వీకరించిన పి.పద్మావతి ని పలువురు అధికారులు కలిసి అభినందనలు తెలిపారు.
Tags kovvuru
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …