Breaking News

అంతర్జాతీయ స్థాయి వైద్య సంస్థను నెలకొల్పడం అభినందనీయం…

-సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి
-ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
-100 పడకలతో అధునాతన వైద్య సేవలు
-ఒకేచోట నెఫ్రాలజీ, యురాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు
-రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా నలుగురు నెఫ్రాలజిస్టులతో అత్యాధునిక కిడ్నీ వైద్యం
-కిడ్నీ చికిత్సల కోసం ప్రత్యేకంగా అమెరికన్ కిడ్నీ ఇనిస్టిట్యూట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో, అంతర్జాతీయ స్థాయి వైద్య సంస్థను నెలకొల్పడం అభినందనీయమని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా విశేషానుభవం కలిగిన నలుగురు నెఫ్రాలజిస్టుల సారథ్యంలో రూపుదిద్దుకున్న ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో, లాభాపేక్ష లేకుండా 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడం హర్షణీయమని కొనియాడారు. ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ విఠల్ కుమార్ చుండ్రు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూత్రపిండాలకు సంబంధించిన సమగ్ర వైద్యసేవలతో కూడిన అమెరికన్ కిడ్నీ ఇనిస్టిట్యూట్ తో పాటు, వివిధ విభాగాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మక సంస్థల్లో శిక్షణ పొందిన నిష్ణాతులైన వైద్య నిపుణులతో ప్రీమియర్ వైద్య సేవలందిస్తుందని చెప్పారు. విశేషానుభవం కలిగిన కిడ్నీ మార్పిడి చికిత్సా నిపుణులతో పాటు, చిన్నపిల్లలకు సంబంధించిన కిడ్నీ వ్యాధులకు చికిత్సనందించేందుకు ప్రత్యేకంగా పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు అందుబాటులో ఉండటం తమ హాస్పిటల్ ప్రత్యేకతగా పేర్కొన్నారు. బీపీ, షుగర్ సంబంధిత కిడ్నీ వ్యాధులు, తాత్కాలిక, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు, గర్భిణిలు, పిల్లల కిడ్నీ వ్యాధులు కాళ్ళ వాపులు, మూత్రములో ప్రోటీన్, రక్తం పోవుట, కిడ్నీ రాళ్ళు, కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ గ్రంధి, మూత్రాశయ ఆపరేషన్లు, యాక్సెస్ ప్లానింగ్, ఏవీ ఫిస్టులాకి సంబంధించిన సమస్యలకు వైద్య సేవలతో పాటు, హిమోడయాలసిస్, పొట్ట (పెరిటోనియల్) డయాలసిస్, హోమ్ డయాలసిస్ వంటి అన్ని రకాల డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ విఠల్ కుమార్ వివరించారు. హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ వరుణ్ కుమార్ బండి మాట్లాడుతూ ప్రీమియర్ హాస్పిటల్ నందు కిడ్నీ మార్పిడి చికిత్సలు, కిడ్నీ సంబంధిత సమస్యలు, పాముకాటు, పురుగుల మందు, పాయిజినింగ్ కేసులకు స్పెషల్ డయాలసిస్ సేవలు లభిస్తాయని అన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, జ్వరం మొదలైన అన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ మొదలైన రుమటలాజికల్ డిజార్డర్లకు మెరుగైన వైద్యసేవలను అందిస్తామని తెలిపారు. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, 32 స్లైస్ సీటీ స్కాన్ సదుపాయాలతో, 24 గంటల అత్యవసర వైద్య సేవలతో అత్యాధునిక ఐసీయూ విభాగం అందుబాటులో ఉందని డాక్టర్ వరుణ్ కుమార్ పేర్కొన్నారు. నొవోటెల్ హోటల్ సమీపంలో ప్రీమియర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ సాయి స్వప్న అట్లూరి, పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు డాక్టర్ మురళీకృష్ణ భాగవతుల, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ స్ఫూర్తి రామినేని పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *