కలెక్టరు జె.నివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన  కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్ పర్సన్ కుమారి పడమట స్నిగ్ధ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్ పర్సన్ కుమారి పడమట స్నిగ్ధ శుక్రవారం కృష్ణా జిల్లా కలెక్టరు జె.నివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరు జె. నివాసు శాలువాతో సత్కరించి పూల మొక్కను స్నిగ్ధ అందజేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ డిసియంయస్ ద్వారా సరఫరా చేస్తున్న స్టేషనరి, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, అంగన్ వాడీ ద్వారా నాణ్యమైన సరుకులను ఇవ్వాలన్నారు. ఛైర్ పర్సన్ స్నిగ్ధ మాట్లాడుతూ డిసియంయస్ ద్వారా పది పెట్రోలు బంకు ఏర్పాటు చేసేందుకు అనుమతులివ్వాలని కోరారు. ఇందుకు అవసరమైన యన్ ఓ సిలలో ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టరు నివాస్ చెప్పారు. నూజివీడు డిసియంయస్ ఆఫీస్ కు స్వంత స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులివ్వాలన చైర్ పర్సన్ స్నిగ్ధ కలెక్టరును కోరగా అందుకు కలెక్టరు నివాస్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డిసియంయస్ బిజినెస్ మేనేజరు యువిడివి. ప్రసాదరావు, మేనేజర్ ఆర్ రమేష్ బాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *