-నిషేధిత పొగాకు, గుట్కా పాన్ మసాలా విక్రయాల నియంత్రణకు విస్తృత తనిఖీలు…
-జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొగాకు, గుట్కా, పాన్ మసాలా విక్రయాలను నిరోధించేందుకు విస్తృత తనిఖీలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్ శివశంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో పొగాకు, గుట్కా, పాన్ మసాలా విక్రయాల నియంత్రణ చట్టాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎల్ శివశంకర్ మాట్లాడుతూ సమాజానికి ఆశనిపాతంగా నిలిచిన ధూమపానంతో పాటు గుట్కా, తదితర వ్యసనల నుండి ప్రజలను దూరం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. జిల్లాలో నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేయడం గుట్కా తినడం వంటి వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే నిషేధిత సిగరెట్లు, గుట్కా విక్రయ వ్యాపారులపై పగడ్బందిగా దాడులు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం సేవించే వారిపై 200 రూపాయల జరిమాన విధించాలన్నారు. గుట్కా విక్రయించే వ్యాపారస్తుల పై దాడులు చేసి ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలను పోలీస్ అధికారులు జరిమాన విధించారన్నారు. కృష్ణాజిల్లాను పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విభాగంలో నిష్ణాతులు అయిన ప్రొఫెసర్ పుట్టి శివశంకర్ పొగాకు నియంత్రణ చట్టాంపై పూర్తి అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, క్రైమ్ డిఎపి మురళి కృష్ణా, డియంఅండ్ హెచ్ఓ డా.యం సుహాసిని, అడిషనల్ డియంఅండ్ హెవో జె. ఉషారాణి, డిఇవో తహెరా సుల్తానా, వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టు మేనేజర్లు పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ యండివి సుబ్రమణ్యేశ్వరరావు సొషల్ వర్కర్ విఎస్ తారక రామారావు తదితరులు హాజరయ్యారు.