Breaking News

నేతలుంగీ, చిరిగినచొక్క మెడలోతువాలు అచ్చతెలుగు రైతువేషంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్…

-జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎరువుల షాపులు తనిఖీ…
-రెండు షాపులను సీజ్… సెక్షన్ 6 ఏ కింద కేసులు నమోదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ రైతు అవతారంలో విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ పలు ఎరువులు షాపులను తనిఖీ చేశారు. ఎరువులు యంఆర్ పి ధరల కన్న అధికంగా అమ్ముతున్నారన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాల మేరకు జిల్లాలోని కైకలూరు, ముదినేపల్లి మండలాల్లో సాధారణ రైతుగా గుడివాడ డివిజన్లో విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నేత లుంగీ, చిరిగిన చొక్క మెడలో తువాలు ధరించి ఒక రైతుగా అవతారమెత్తిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ కైకలూరు మండల కేంద్రంలోని వాసవీ ఫెర్టిలైజర్స్ కు వెళ్లి యూరియా, డిఏపి ఎరువులు అడగ్గా మా దగ్గర లేవనే సమాధానం షాపు యాజమాని నుంచి వచ్చింది. దీంతో మరోక ఎరువుల షాపు అయిన వెంకటనాగదత్త ఎజెన్సీస్ కి సబ్ కలెక్టర్ వెళ్లగా యూరియా రూ. 280, డిఏపి రూ.1250లకు సొమ్ము తీసుకుని బిల్లు ఇవ్వకుండా తెల్ల పేపర్ మీద రశీదులా రాసి గోడౌన్ కి వెళ్లి ఎరువులు తీసుకోమని సదరు షాపు దారుడు చెప్పడంతో సబ్ కలెక్టర్ స్వయంగా బైక్ నడుపుకుని గోడౌన్లో పేపర్ రశీదును చూపి ఒక యూరియా, ఒక డిఏపి కట్టని బైక్ మీద పెట్టుకుని తిరిగి షాపు వద్దకు చేరుకున్నారు. యూరియా యంఆర్ పి ధర రూ 266.50 కాగా రూ. 280/- డిఏపి యంఆర్ పి ధర రూ. 1200/- వుండగా రూ. 1250కి అమ్మడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకంటే అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నా తీరును స్వయంగా ఆయన గుర్తించారు. దీనితో వెంటనే సహాయ వ్యవసాయ సంచాలకులు, కైకలూరు తహాశీల్దార్‌ను పిలిపించి వాసవీ ఫెర్టిలైజరకు వచ్చి అందరి సమక్షంలో గోడౌన్ తనిఖీ చేయగా ఎరువుల నిల్వలు వుండడం గమనించారు. ఈ విధంగా ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేకుండా బిల్ ఇవ్వకుండా అధిక ధరలకు ఎరువులను విక్రయం చేస్తున్న రెండు షాపులను సీజ్ చేయాలని కేసులను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఏడిఏ, తహాశీల్దారు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆదేశించారు. ముదినేపల్లి మండలం దేవపుడి గ్రామంలో శ్రీ లక్ష్మి గణేష్ ట్రేడరను తనిఖీ చేసేందుకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ వెళ్లగా ఆ షాపు మూసి వేసి వుండడం ఆయన గమనించారు. దీనిపై ముదినేపల్లి మండల వ్యవసాయ అధికారిని పిలిపించి సదరు షాపును తనిఖీ చేసి డీలర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మి రైతులను నష్టపరిచే ఎరువుల డీలర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ చంద్ ఆదేశించారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *