విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రప్రభుత్వం ఆధీనంలోని డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ) మరియు నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ (ఎన్ ఐ ఎఫ్) ద్వారా నిర్వహించబడుతున్న కార్యక్రమం పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలకు బీజం వేస్తూ, బాల శాస్త్రవేత్తలను, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతుందని దీనిని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్ శివశంకర్ అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు శివశంకర్ ఇన్ స్పైర్ అవార్డు మనక్ -2021-22 పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా విద్యా శాఖాధికారినితాహెరా సుల్తానా మాట్లాడుతూ అన్ని మేనేజిమెంట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు, ఉపాద్యాయులు సెప్టెంబర్ 15లోపు నామినేషన్ ప్రక్రియ పూర్తిచేసి జిల్లాను ప్రధమ స్థానంలో నిలపాలని అన్నారు. దీనిపై త్వరలలో గణితం, సైన్స్, సోషల్ ఉపాధ్యాయులకు అవగాహనా సమావేశాలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమాన్నిఉప విద్యాశాఖాధికారులు మరియు ఎంఈవోలు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో విజయవాడ ఉపవిద్యాధికారి ఎల్.చంద్రకళ ,డీసీఇబి సెక్రటరి లలితమోహన్ , జిల్లా సైన్స్ ఆఫీసర్ (డీఎస్ఓ) మైనం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …