Breaking News

ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ నాయకులు సిఫార్సులు చేస్తే రావు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో మాదిరిగా రాజకీయ నాయకులు సిఫార్సులు చేస్తే ఎంత మాత్రం రావని, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో విద్యార్హత ఆధారంగా అభ్యర్థి దరఖాస్తు చేసుకొని బాగా చదివి పోటీ పరీక్షలలో విజేతలై ఇంటర్వ్యూలలో నెగ్గి ఒక సమగ్ర విధానం ద్వారా వివిధ సర్కారి కొలువులలో నియమితులవుతారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చి చెప్పారు.
శుక్రవారం  తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంకు గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రయాణమయ్యే హడావిడిలో సైతం ప్రజలు ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగానైనా మీరే ఇప్పించాలని, మంత్రిగా మీకు అదేమంత పెద్ద కష్టమైన పని కాదని, ఎలాగోలా గవర్మెంట్ జాబ్ మా అమ్మాయి చేయాల్సిందే ఒక మహిళ మంత్రిని అడిగింది. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం తన వల్ల సాధ్యం కాదని ,ఆ విధంగా చేయలేనని ఆ మహిళకు చెప్పారు.
పెడన నియోజకవర్గం తోటమూల గ్రామానికి చెందిన కాలెపు లీలా ప్రసాద్ మంత్రిని కలిశారు. తనను వృద్ధాశ్రమమంలో చేర్పించాలని అభ్యర్ధించారు.
స్థానిక పోతేపల్లి సమీపంలోని ఉల్లిపాలెంకు చెందిన కూనపరెడ్డి విజయలక్ష్మి మంత్రి పేర్ని నాని వద్ద తన సమస్య చెప్పుకొంది. గత ఏడాది తానకు గొంతులో థైరాయిడ్ గ్రంధి శస్త్రచికిత్స ద్వారా తొలగించారని అందుకోసం ఇల్లు తాకట్టు పెట్టి లక్షరూపాయలు తీసుకోని ఆపరేషన్ చేయించుకొన్నానని ముఖ్యమంత్రి సహాయనిధి పొందేందుకు బిల్స్ పెట్టానని ఆ సొమ్ము ఇంకా రాలేదని తెలిపింది.
వడ్లమన్నాడు శివారు కలిపురం గ్రామానికి చెందిన తోట శివ ఆంజనేయులు మంత్రికి తన కష్టాన్ని తెలిపాడు. తనకు చేతులు కాళ్ళు సరిగా పనిచేయవని తనకు వికలాంగుల పింఛన్ ఇప్పించాలని అభ్యర్ధించారు. స్థానిక ఖాలేఖాన్ పేటకు చెందిన నిడదవోలు శ్యామల మంత్రికి తన ఇబ్బందిని తెలిపింది. తన మూడు సెంట్ల ఇంటి స్థలంలో చొరబడి తన పొరుగింటివాళ్ళు తూర్పు దారి మూసివేశారని దీంతో తాను పడమట దారిలో నడుస్తున్నానని ఈలోపు వెనకింటివారు ప్రహారీగోడ కట్టేశారని, గత ఏడాది తన సమస్యను మీ వద్ద చెబితే, ఆ స్థలం సర్వే చేయించాలని మునిసిపల్ , పోలీస్ అధికారులకు ఆదేశించారని ఆ సర్వేలో తన స్థలంలో పొరుగింటివారి ప్రహరీ గోడ , బాత్రూం వచ్చిందని తన ఇంటికి అడ్డంగా ఉన్న వాటినీ త్వరగా తొలగించాలని అధికారులు చెబుతున్నా ఆక్రమించినవారు అక్కడనుంచి కదలమని చెబుతుందని మంత్రి పేర్ని నానికి చెప్పింది. తన వ్యక్తిగత కార్యదర్శి రఘురామ్ ను కలిసి జరిగిన విషయం చెప్పాలని మంత్రి సూచించారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి ఏక సభ్య కమిషన్ నియమించిన సుప్రీం కోర్ట్

-ఏక సభ్య కమిషన్కు 2025 జనవరి 9 లోగా రిప్రజెంటేషన్స్ సమర్పించవచ్చు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *