అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నేపథ్యంలో సతమతమవుతున్న నిరుపేదలకు అక్షయ పాత్ర పంపిణీచేసే కిరాణా సరుకులను సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు శుక్రవారం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో సచివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది హౌస్ కీపింగ్ ఉద్యోగులకు తొమ్మిది రకాల కిరాణా సరుకులతో కూడిన సంచులను మంత్రులు పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, పుట్నాలపప్పు, గోదుమ పిండి, పంచదార, ఆయిల్, పసుపు, కారం, సాంబార్ పొడి తదితర తొమ్మిది రకాల కిరాణా సరుకులతో కూడిన సంచులను పంపిణీచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి, అక్షయ పాత్ర పౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వంశీధరరాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …