తెలుగు భాషాభివృద్దిలో అందరూ పునరంకితం కావాలి… : డా.నందమూరి లక్ష్మీ పార్వతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషాభివృద్దిలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శనివారం విజయవాడలో హాటల్ ఇలాపురంలోని కన్వెన్షన్ హాల్ లో ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన తెలుగు వైభవ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవ సభ ఏర్పాటయ్యింది . ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రపంచ భాషల్లో తెలుగుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి పలు కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా భాషాభివృద్దిలో భాగస్వాములు కావాలని కోరారు. సభాధ్యక్షులు డా.కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నిభాషలున్న తెలుగుకు సాటి మరొకటి లేదన్నారు.ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీమంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ మాతృభాష మర్చిపోతే మనుగడ ఉండదన్నారు.అమ్మభాష లో ఉండే కమ్మదనం మరేభాషలో రాదని ఉద్ఘాటించారు. అనంతరం పలువురు 31మంది భాషావేత్తలకు తెలుగు వైభవ కీర్తి పురస్కారాలను పిఠాపురం సంస్థాన రాజవంశీకులు రాజారావు వేంకట మహీపతి రామా రత్నరావు,డా.లక్ష్మీ పార్వతి చేతులమీదుగా అందజేశారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వాస్తునిపుణులు డా.కె.వి.రెడ్డి, డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ మేదర సురేష కుమార్ , పుడమి సాహితీవేదిక అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి, తెలుగు భాషాభివృద్దిసమితి రాష్ట్ర అధ్యక్షుడు డా.గూటం స్వామి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి రమావతి పలువురు సాహితీ వేత్తలు హాజరయ్యారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *