తెలుగుదేశం ఎక్స్ పైరి డేట్ అయిన పార్టీ…

-రాజకీయ ఉనికి కోసమే బోండా ఉమా దిగజారుడు రాజకీయాలు…
-వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, శర్వాణి మూర్తి, కొంగితల లక్ష్మీపతి, జానా రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు అనర్హుడని విజయవాడ కాపు సోదరులందరూ ఓటు రూపంలో తీర్పునిచ్చినా ఆయన బుద్ధి మారలేదని వైఎస్సాస్ సీపీ కార్పొరేటర్లు అన్నారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా ని కిరాతకంగా హతమార్చిన పార్టీ నీడన ఉంటూ.. బోండా ఉమా, ఆయన చెంచాలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను నగర ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికైన బోండా ఉమామహేశ్వరరావుకి సెప్టెంబర్ 17, 2018 వరకు కాపుల కోసం కళ్యాణ మండపం నిర్మించాలనే ఆలోచన ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్ల పాటు తెలుగుదేశం నాయకులు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా..? అని ప్రశ్నించారు. విజయవాడ నగర ప్రజల అభిమాన నాయకులు  వంగవీటి మోహన రంగా ని నిరాహార దీక్షలో ఉండగా పొట్టనపెట్టుకుంది తెలుగుదేశం నాయకులు కాదా? అని ప్రశ్నించారు. రంగా హత్య కేసులో ముద్దాయిలను చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారని నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో బహిరంగంగా విమర్శించిన బోండా ఉమా.. అదే పార్టీలో ఏ ముఖం పెట్టుకుని కొనసాగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. మీ ప్రభుత్వ హయాంలో సింగ్ నగర్ పైపుల రోడ్డు వద్ద రంగా  విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు బోండా ఉమా, ఆయన అనుచరగణం ఏం చేశారని ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో చంద్రబాబు అణచివేసిన నాడు.. మీరంతా ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. కాపులను ఓసీలో, బీసీలో తెలియని సందిగ్ధంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పడవేసిన నాడు.. మీరందరూ ఎందుకు నోరు మెదపలేదన్నారు. చంద్రబాబు కాపుల గొంతు కోశారని సాక్షాత్తూ బోండా ఉమా నాడు మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే మీకు కాపు హక్కుల గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.

విద్యార్థి దశ నుండి వంగవీటి రంగా తో కలిసి మల్లాది విష్ణు  పేదల పక్షాన అనేక ఉద్యమాలలో పాల్గొని వారి హక్కుల సాధనకై పోరాటాలు చేశారని ఈ సందర్భంగా కార్పొరేటర్లు గుర్తుచేశారు. ఇప్పటికీ ఆయన అడుగు జాడలలోనే నడుస్తూ.. వంగవీటి రంగా గారి ఆశయ సాధనకై నిరంతరం పేద ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. కేవలం మల్లాది విష్ణు  చేతిలో ఓటమి పాలయ్యాననే దుగ్ధతో బోండా ఉమా ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా జీవనంలో బోండా ఉమాకి, మల్లాది విష్ణు కి నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. చంద్రబాబు అండతో నియోజకవర్గాన్ని దోచుకున్న వ్యక్తి బోండా ఉమా కాగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వరకు ఆయా ముఖ్యమంత్రుల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకులు  మల్లాది విష్ణు ని చెప్పుకొచ్చారు. కనుక మల్లాది విష్ణు  గూర్చి మాట్లాడే స్థాయి బోండా ఉమాకి గానీ ఆయన చెంచాలకు లేదనే విషయాన్ని గ్రహించాలన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం కాపులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని.. ఐదేళ్ల టీడీపీ పాలనలో కాపులకు కనీసం రూ. 2వేల కోట్లను కూడా కేటాయించలేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి  రెండేళ్ల పాలనలో ఏకంగా రూ. 12 వేల కోట్లను సంక్షేమాన్ని కాపు సోదరసోదరీమణులకు అందించడం జరిగిందన్నారు. అలాంటప్పుడు ఎవరి హయాంలో కాపులు అభ్యున్నతి సాధించగలరో తెలుగుదేశం నాయకుల విజ్ఞతకే వదలేస్తున్నామన్నారు. బోండా ఉమామహేశ్వరరావు అధికారంలో ఉన్నప్పుడు కాపు సోదరుల అభ్యున్నతికి ఏమి చేశారో సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. శాసనసభ్యుడిగా ఆయన నాలుగున్నరేళ్ల పదవీ కాలం అక్రమార్జనకు, కబ్జాల పర్వానికే సరిపోయిందన్నారు. చివరకు ఎన్నికలు సమీపించడంతో కాపు కళ్యాణ మండపాన్ని తెరమీదకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. బోండా ఉమాకు నిజంగా చిత్తుశుద్ధి ఉంటే.. గెలిచిన నాలుగున్నరేళ్ల వరకు కళ్యాణ మండపాన్ని ఎందుకు నిర్మించలేదో జవాబు చెప్పాలన్నారు. కాపు కళ్యాణ మండపాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసిందో స్పష్టం చేయాలన్నారు. కేవలం మొక్కలు నాటినంత మాత్రాన.. ఏదో నిర్మాణాలు జరిగిపోయినట్లు ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఈ నీచ రాజకీయాలకు తెలుగుదేశం నాయకులు స్వస్తిపలకాలని.. నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేస్తున్న మల్లాది విష్ణు కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *