-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావర పరిరక్షణకు మొక్కలు యొక్క ప్రాధాన్యత ను తెలుసుకొని పెంచటానికి ముందుకొస్తున్న సేవా హృదయులకు అభినందనలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కైకలూరు పట్టణంలోని,సీహచ్ సీ హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ జాన్ విక్టర్, గండికోట ఏసుబాబు, శ్రీధర్, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ జాన్ విక్టర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మొక్కలు ఏర్పాటుచేయడం ఇప్పుడిలా నాటడం చాలా సంతోషంగా వుందన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకోని, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పెంచాలని అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇటీవల జగనన్న “పచ్చ తోరణం” కార్యక్రమంలో భాగంగా రోడ్డులకు ఇరు వైపులా 2 సంవత్సరాలు వయసు వున్న మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. మొక్కలు నాటడం, పెంచడం మన అందిరి భాద్యతన్నారు. ప్రతి వ్యక్తి ఒక్క మొక్క నాటి పెంచవలసిన అవసరం ఉందని డిఎన్ఆర్ అన్నారు. కార్యక్రమంలో డాక్టర్స్ ఆదిలక్ష్మి, ప్రశాంతి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహ్మద్ జహీర్, అబ్దుల్ హమీద్, నిమ్మల సాయిబాబు, ఉలిసి శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్, కూనవరపు సతీష్, సోమల శ్యామ్ సుందర్,మాడపాటి చింతయ్య, మదన్,,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.