గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రములో శారీరక విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భోరోసా కల్పించి ఆర్దికంగా ఆదుకోవడం జరుగు తోంది అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గోపాలపురం ఏ.యం.సి. కార్యాలయంలో శనివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గుర్తింపబడిన 110 మంది శారీరక విభిన్న ప్రతిభావంతులకు 40.70 లక్షల విలువైన ట్రై సైకిల్స్ పంపిణీ చేశా రు. అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆడుకోవడం జరుగుతోంది అని అన్నారు. దివ్యాంగులు ఏటువంటి ఇబ్బందులు పదకూడదూ, ఎవరిపై ఆధారపడకూడదు అని పింఛను ఏర్పాటు చేసి, పింఛను రెట్టింపు చేయడం జరిగింది అన్నారు. దివ్యాంగుల కోసం సదరం క్యాంపు లు ఏర్పాటు చేసి ఏటువంటి ఇబ్బందులు లేకుండా ఆడుకోవడం, జరుగు తోంది అన్నారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా వుండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం ఝాన్సీ రాణి, గన్నమనేని జనార్దన్ రావు ఏఎంసీ చైర్మన్, షేక్ ఖాదర్ వల్లి భాష వైసిపి మండల ప్రెసిడెం ట్, ఉప్పల దుర్గారావు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఇ ళ్ళభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Tags gopalapuram
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …