Breaking News

స్వాతంత్య స్పూర్తి ” అంశం పై పొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన పోటీలు…

-ఆసక్తి గల విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈనెల 11 లోపు ప్రతిపాదనలు పంపవచ్చు…
-సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య స్పూర్తితో మన దేశ జాతీయ, ఐక్యతను బలోపేతం చేయడమే మనందరి బృహత్తరమైన బాధ్యత అని విజయవాడ సబ్ కలెక్టరు జి.యస్.యస్.ప్రవీణ్ చంద్ అన్నారు. ఇందులో భాగంగా విజయవాడ సబ్ కలెక్టరు కార్యాలయం ఆధ్వర్యంలో ” స్వాతంత్ర్య స్పూర్తి ” అనే అంశం పై పొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను 2021 ఆగష్టు 15న సంతోషంగా సగర్వంగా జరుపుకోబోతున్నామన్నారు. భారతదేశ స్వాతంత్య సాధనలో ఎ ందరో ధైర్యసాహసాలతో పోరాటం జరిపి ఎందరో వారి ప్రాణాలను త్యాగం చేసారన్నారు. ఈరోజున చాలా స్వేచ్ఛగా జీవిస్తున్న మనందరం వారి త్యాగాలను చూపిన దేశభక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న 75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఆగష్టు 15 నుండి 2021 ఆగష్టు 15 వరకూ నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు.
ఇందులో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలో స్వాతంత్య స్పూర్తి ముఖ్యాంశంతో వివిధ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా దేశంలోని పలువురు స్వాతంత్య సమరయోధులను స్మరించుకుందామన్నారు. స్వాతంత్ర్య స్పూర్తి అంశంపై నిర్వహించే ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలలో విజయవాడ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలందరూ ఈపోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలలో పాల్గొనదలుచుకునేవారు సంబంధిత మండల స్థాయి అధికారు లైన తహశీల్దార్లు, యంపిడిఓలు, మండల విద్యాశాఖాధికారి వారికి ప్రతిపాదనలు పంపవచ్చన్నారు. అదేవిధంగా ఈపోటీల్లో పాల్గొనాలనుకునేవారు scofficevia@gmail.com లేదా ఫోన్ నెంబరు 9849903966 కు పంపవచ్చన్నారు. ఉత్సాహవంతు లైన పోటీదారులందరూ తమ ప్రతిపాదనలను ఆగష్టు 11వ తేది బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా పంపాలని ఆప్రకటనలో సబ్ కలెక్టరు
ప్రవీణచంద్ పేర్కొన్నారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *