-2000 కోట్ల రూపాయలతో 24/7 త్రాగునీటి సరఫరా…. మధురై కార్పొరేషన్ లో అమృత్ ప్రాజెక్ట్ అధ్యాయనం చేసిన విఎంసి కార్పొరేటర్లు
-పెరియార్ బస్టాండ్ స్ట్రక్చర్, వర్షపు నీటి నిర్వహణ పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2000 కోట్ల రూపాయలతో మధురై నగర ప్రజలకు 24/7 త్రాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు మధురై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఇంద్రాణి పొన్వసంత్. శనివారం ఉదయం అన్నమలై లోగల మధురై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సమావేశపు గదిలో దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞాన యాత్రపై వచ్చిన విజయవాడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ రెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లకు స్వాగతం పలికారు మేయర్ ఇంద్రాణి పొన్వసంత్, కమిషనర్ చిత్ర విజయన్.
తమ నగర కార్పొరేటర్ లను పరిచయం చేశారు మధురై కార్పొరేషన్ మేయర్. విజయవాడ నగరం గురించి నగర ప్రాముఖ్యత గురించి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు, కార్పొరేటర్లు తమ పరిచయాలు చేసుకొన్నారు.
ఈ సందర్భంగా మధురై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఇంద్రాణి పొన్వసంత్ మాట్లాడుతూ మధురై నగరంలో 100 వార్డులు, ఐదు జోనులు ఉన్నాయని, తమిళనాడు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద కార్పొరేషన్ అని, మధురై నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా కోసం రెండు వేల కోట్ల రూపాయలతో అమృత్ ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజు 24 గంటలు త్రాగునీటి సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కల్పిస్తున్నారని, గతంలో కేవలం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు మాత్రమే నీటి సరఫరా ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ సమస్యను అధిగమించి 24/7 వాటర్ సప్లై ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ లాగ ఉన్న వారి కౌన్సిల్ హాల్ ను చూపించారు.
ఈ సందర్భంగా మధురై నగర కమిషనర్ చిత్ర విజయన్ మాట్లాడుతూ మధురై నగరం స్మార్ట్ సిటీ నగరం అని, ముఖ్యంగా మధురై మున్సిపల్ కార్పొరేషన్ లో పెరియార్ బస్టాండ్ ను 174.56 కోట్ల నిధులతో ఐదు అయితంతస్తులు నిర్మించారని, అందులో 2 అంతస్తులు బేస్మెంట్ కొరకు 3 అంతస్తులు భవనాన్ని నిర్మించారని అన్నారు. ముఖ్యంగా బేస్మెంట్లో రెండు అంతస్తులు ఉన్నప్పటికీ వర్షాకునిటి నిలువలు బేస్మెంట్లో రాకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ మేనేజ్మెంట్ నిర్వహణ చేశారని దాని కొరకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి నిలువలు ఉండగలగా సంపులు ఏర్పరిచి వాటిలో నిలువ ఉన్న నీరును ఫైర్ సేఫ్టీ కొరకు వాడతారని తెలిపారు.
తదుపరి మధురై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పెరియార్ లోని పెరియార్ బస్టాండు మ్యాప్ ఆధారం గా వారు నిర్మించిన భవనాన్ని కార్పొరేటర్లకు చూపించారు. కార్పొరేటర్లు భవన స్ట్రక్చర్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సొంపులు, వాన నీటిని స్క్వేర్ సేఫ్టీ కోసం వాడుతున్న విధానాన్ని అధ్యయనం చేసి విజయవాడ నగరంలో కూడా ఇటువంటివి ఎంతో ముఖ్యమైనవని నాకు అభివృద్ధిలో ఇటువంటి వినూత్న ప్రాజెక్టును అమలుచేస్తే బాగుంటుందని చర్చించారు.
Prajavartha Online Telugu News