Breaking News

పీఎం సూర్య ఘర్ లబ్ధిదారుల అభిప్రాయం

-ఏవి రమణ చల్లపల్లి ఎంపీడీవో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులైన చల్లపల్లి ఎంపీడీవో ఏవి రమణ మాట్లాడుతూ ఉయ్యూరు మండలంలోనీ కలవపాములలో తనకు సొంత ఇల్లు ఉందని అక్కడ 3 కిలో వాట్ల యూనిట్లతో 2 లక్షల రూపాయల వ్యయంతో జనవరి నెలలో సౌరఫలకాలను ఏర్పాటు చేసుకున్నామని, 78 వేల రూపాయల కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఒక వారం రోజుల్లో వచ్చిందని, తనకు నెలకు 1500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు విద్యుత్ ఛార్జీల బిల్లులు వస్తుండేవని, ప్రస్తుతం కేవలం 500 రూపాయల వరకే బిల్లు వస్తుందన్నారు. అందులో విద్యుత్ చార్జీల తో పాటు ఇతర చార్జీలు కలిసి ఉన్నాయన్నారు. తన ఇంట్లో సౌరఫలకాల ద్వారా నెలకు 400 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, అందులో తాను నెలకు 200 యూనిట్లు ఖర్చు చేసుకోగా ఇంకా 200 యూనిట్లు మిగులుతున్నాయన్నారు. అవి ప్రభుత్వానికి ఇస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీల బిల్లు చాలా తక్కువగా వస్తుండడంతో ప్రస్తుతం తమ ఇంట్లో ఉన్న 2 ఏసీలకు అదనంగా మరో ఏసీ ని కూడా ఇటీవలే బిగించుకున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *