మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ పోర్టు నిర్మాణమని, సకాలంలో పూర్తి చేసి మచిలీపట్నం వాసులకు పోర్టును అంకితం చేస్తామని రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర,. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి బందరు ఓడరేవు నిర్మాణం పనులను పరిశీలించారు.
• పోర్ట్ అభివృద్ధి పనుల పురోగతిపై వారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
• అధికారులతో కలిసి మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులను వారు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మచిలీపట్నం పోర్టు పనులు చాలా నెమ్మదిగా జరిగాయన్నారు.
• మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ పోర్టు నిర్మాణమని. దీన్ని సకాలంలో పూర్తి చేసి మచిలీపట్నం వాసులకు అంకితం చేస్తానన్నారు.
• పోర్టు నిర్మాణానికి ఏ విధమైన అడ్డంకులకు ఆస్కారం లేకుండా అన్ని అనుమతులు వచ్చాయన్నారు. .
• ఇప్పటి వరకు 30 శాతం పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు.
• నాడు తెలుగుదేశం పార్టీ చేసిన కృషితోనే నేడు ఈ పోర్టు ముందుకు సాగుతోందన్నారు. .
• సకాలంలో పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు.
• ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పోర్టు పురోగతిపై సమీక్షా నిర్వహిస్తున్నారన్నారు. ..
• ఆంధ్రప్రదేశ్ లో పోర్టులకు మచిలీపట్నం పోర్టు కేంద్ర బిందువుగా ఉందన్నారు. *
• రాజధాని అమరావతికి అతి సమీపంలోఉన్న కీలకమైన పోర్టు మచిలీపట్నంమని అన్నారు.
• తమిళనాడు రాజధాని చెన్నె, మహారాష్ట్ర రాజధాని ముంబాయి.. పోర్టుల మాదిరిగానే అమరావతికి చేరువలో ఉన్న పోర్టు మచిలీపట్నంమన్నారు.
• భవిష్యత్తులో రాజధాని అమరావతి చేరువగా ఉంటూ.. మచిలీపట్నం పోర్టు ఏపీ ప్రయోజనాల రీత్యా వ్యూహాత్మకంగా మారనుందన్నారు. *
• మచిలీపట్నం పోర్టుకు భవిష్యత్తులో అన్ని విధాలుగా అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు. .
• సకాలంలో నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో పోర్టుకు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే, త్వరితగతిన పూర్తి చేస్తున్నానన్నారు. ..
• అతి త్వరలో మచిలీపట్నం పోర్టును పూర్తి చేసి తీరుతామన్నారు.
మంత్రి కొలు రవీంద్ర మాట్లాడుతూ పోర్టు నిర్మాణ స్థితిగతుల్ని ప్రజలకు తెలియజేయడంతో పాటుగా, వేగవంతం చేయడం కోసం నిత్యం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు..
-ముఖ్యమంత్రి గారు కూడా పోర్టు పనులపై చిత్తశుద్ధితో పరిశీలిస్తున్నారన్నారు.
– ఇప్పటి వరకు 4 బెర్తుల పనులు, రోడ్డు పనులు, విజయవాడకు అనుసంధానించే పనులు 43% పూర్తయ్యాయన్నారు.
– గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరు పోర్టు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
– ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి నిర్మాణంలో కూడా పోర్టు భాగస్వామిగా మారబోతోందన్నారు.
– పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. .
– మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామన్నారు.
– సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఈ పర్యటనలో మారి టైం బోర్డు సి రాఘవరావు బందరు ఓడరేవు జనరల్ మేనేజర్ తులసీదాసు ఆర్డిఓ స్వాతి తహసిల్దారు మధుసూదన్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపు సత్యనారాయణ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News