మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే మే నెల 2 వ తేదీన ప్రధానమంత్రి పాల్గొనే అమరావతి రాజధాని పునః నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి 5 లక్షల మంది వస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి కార్మిక రాష్ట్ర కార్మిక కర్మాగారాలు బాయిలర్లు బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మే 2 న ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న క్రమంలో.. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి, కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ డీ కే బాలాజీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం, రవాణా సదుపాయం, తాగు నీరు సదుపాయం, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సభ వేదికకు చేరుకోవడం వంటిసన్నాహాక ఏర్పాట్లపై మంత్రులు అధికారులతో సమీక్షించారు. ప్రధాని సభను విజయవంతం చేయాలని మంత్రులు. పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, రాష్ట్ర మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, కూటమి సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ సుభాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీరు వైద్య సదుపాయము ఆహారము అందించడంతోపాటు రాకపోకలకు ఎలాంటి సమస్య లేకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ*మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా రాజధానిని నిర్మాణం జరగబోతోందన్నారు. దేశ చరిత్రలో ఎవ్వరూ చేయని త్యాగం అమరావతి రైతులు చేసి, 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని ప్రారంభిస్తే, తదుపరి వచ్చిన ప్రభుత్వం మధ్యలో వదిలేసిందన్నారు.. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి, మూడు ముక్కలాటతో అమరావతి రాజధానే లేకుండా చేశారన్నారు. నాడు అమరావతి రైతులు ఎడతెగని పోరాటం చేసినా, నాటి ప్రభుత్వానికి రైతుల ఘోష వినపడలేదన్నారు. మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా రాజధానిని నిర్మించబోతున్నామన్నారు. అమరావతి రాజధాని పునర్ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములం అవుతామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహాంగా ఉన్నారన్నారు.
అమరావతి మనందరి రాజధాని అనే భావనతో, ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున రాజధాని పునః పనులు ప్రారంభోత్సవానికి ప్రజలు రాబోతున్నారన్నారు. ప్రధాని సభకు విచ్చేసే ప్రజలకు తగిన ఏర్పాట్లు, రవాణా సదుపాయం, తాగు నీరు ఆహారం, అందించడం, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సకాలంలో సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయడంపై ఈ సందర్భంగా చర్చించామన్నారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు వచ్చాయన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై తిరిగి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారబోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా ప్రధాని మోదీ సహాయ సహాకారాలు అందిస్తున్నారన్నారు.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం హయాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారన్నారు. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మహిళా రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నో అట్రాసిటీ కేసులు కూడా పెట్టారన్నారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. నూతన యన్ డి ఏ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధానమంత్రి చేతులు మీదుగా ప్రారంభం కావడం శుభపరిణామం అని, దీంతో పండుగ వాతావరణం నెలకొని ఉందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాకపోకలకు అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు మళ్లీ అమరావతి పనుల్ని వేగవంతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నాలు మూలాల నుండి ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలన్నారు. కృష్ణా జిల్లా నుండి లక్ష మంది జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సభకు విచ్చేసిన ప్రజలకు అన్ని రకాల సదుపాయలు కల్పించేలా అధికారుల్ని సన్నద్ధం చేస్తున్నామన్నారు. మన అమరావతి నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గతంలో విశాఖ కేంద్రంగా ప్రధాని రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పుడు ప్రజల రాజధాని మన రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు బోతున్నామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు డి ఆర్ డి ఏ వీడి హరిహరనాథ్, డిపిటిఓ వాణిశ్రీ, ఆర్టీవో శ్రీనివాసరావు, డిఎంహెచ్వో డాక్టర్ సెమిస్టర్ జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ డిపిఓ అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News