విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు,మాజీ ప్రభుత్వ విప్ కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా కాగిత వెంకట్రావు చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గన్నె ప్రసాద్, కొత్త నాగేంద్ర కుమార్(నాగబాబు) పూలమాలవేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.
గన్నె ప్రసాద్, కొత్త నాగేంద్ర కుమార్(నాగబాబు) మాట్లాడుతూ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్తగా,బడుగు బలహీన వర్గానికి చెందిన సాధారణ దిగువ తరగతి కుటుంబం నుండి వచ్చారని,1985 లో శాసనసభ్యునిగా గెలవడం జరిగిందని, 1994లో అన్న నందమూరి తారక రామారావు ఆరు నెల ముందు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రెండో వ్యక్తిగా కాగిత వెంకట్రావు గారు ఉన్నారని,1994 నుండి శాసనసభ్యునిగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ గా, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కడ శ్వాస వరకు తెలుగుదేశం పార్టీకి సేవలందించారన్నారు.జిల్లాలో బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ,వారి కష్ట సుఖాలలో తోడుగా ఉన్నారన్నారు. ఆనాటి నందమూరి తారకరామారావు దగ్గర నుండి ఈనాటి చంద్రబాబు గారు వరకు వెంకట్రావు అని ఆప్యాయతగా పిలుచుకునే వ్యక్తి వెంకట్రావు అని అన్నారు. ఆయన కుమారుడు కాగిత కృష్ణ ప్రసాద్ కి శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చి పెడన నియోజవర్గం నుంచి పోటీ చేయించి గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ అన్నారు.కాగిత వెంకటరావు ని ఆదర్శంగా తీసుకొని నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు,మరక శ్రీనివాస్ యాదవ్,బెజవాడ తిరుపతి గౌడ్,దేవర సత్యనారాయణ, బొల్లా వెంకటేశ్వరరావు గౌడ్,వాకా వెంకటేశ్వరరావు గౌడ్, పొన్నం రవికుమార్, కోడూరు ఆంజనేయ వాసు, జాస్తి సురేష్, భీమవరపు వెంకట కోటేశ్వరరావు, మన్నెం పోతరాజు, గుమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News