Breaking News

తీర ప్రాంతంలో ప్రముఖ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతాం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రినీ అన్ని విధాల అభివృద్ధి చేసి తీర ప్రాంతంలో ప్రముఖ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి( జి జి హెచ్)లో ఏర్పాటుచేసిన క్లినికల్ లెక్చరు గ్యాలరీని మంత్రివర్యులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ఇంజనీరింగ్ విభాగపు ఉద్యోగి తలపురెడ్డి శ్రీనివాసరెడ్డి తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా రోగులకు బల్లలు, స్టేచర్ ట్రాలీలు, మెడిసిన్ ట్రాలీలు మంత్రి చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు.

అనంతరం ఆసుపత్రిలో అతను ఏర్పాటు చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహం మంత్రి ఆవిష్కరించి, ఉద్యానవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆసుపత్రి సానిటరీ వర్కర్ రవితేజ దాతగా మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రివర్యులు ప్రారంభించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా బల్లలు ఆసుపత్రికి అందజేశారు. నైటింగేల్ విగ్రహం, రోగులకు బల్లలు ర్ట్రాలీలు అందజేసిన దాత శ్రీనివాసులు రెడ్డిని ఈ సందర్భంగా మంత్రివర్యులు ఘనంగా సత్కరించారు.

తదనంతరం మంత్రి మాట్లాడుతూ వైద్యం అంటేనే సేవ అని ఫ్లోరెన్స్ నైటింగేల్ తన జీవితాన్ని వైద్య సేవలకు అంకితం చేశారని, అనేక మందికి సేవలు చేసి స్ఫూర్తినిచ్చిన మానవతా మూర్తి అని కొనియాడారు. జిల్లా ఆసుపత్రికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని బ్రిటిష్ కాలం నుండి మంచి పేరు పొందిన ఆసుపత్రి అన్నారు. నర్సింగ్ కళాశాల కూడా ఇందులో ఉందని 200 మంది దాకా నర్సింగ్ విద్యార్థులు ఉన్నారని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నర్సింగ్ కళాశాలకు నిధులు సమకూర్చి త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు.

మొన్న ఆరోగ్య శాఖ కార్యదర్శి తో మాట్లాడానని త్వరలో సమావేశం నిర్వహించి పురోగతి సాధిస్తామన్నారు.
ఈ జిల్లా ఆస్పత్రి మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉందన్నారు. మరిన్ని నిధులు సమకూర్చి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి పరిచి తీర ప్రాంతంలో ప్రముఖ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దామన్నారు. ప్రస్తుతం క్యాజువాలిటీలో కొందరు డాక్టర్ల కొరత ఉందని ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి ఆశాలత, నర్సింగ్ సూపరింటెండెంట్ డా. ఆశా సజన, ఆర్ ఎం ఓ డాక్టర్ నిరంజన్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రోజా రమణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, కార్పోరేటర్ అనిత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పలువురు నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *