Breaking News

సామాజిక.. ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– పెన్షన్ అందించి పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిదే
– హామీ మేరకు ఏప్రిల్ నుండే రూ.4000 పెన్షన్ ఇస్తున్నాం
– గత పాలకులు హామీ ఇచ్చి దగా చేశారు
– పెన్షన్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇది మంచి ప్రభుత్వం అని పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. అన్న ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్లు ప్రారంభిస్తే నేడు రూ.4000కు పెంచి అందిస్తున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. గత పాలకులు పెన్షన్ పెంపు పేరుతో దగా చేశారన్నారు. అధికారంలోకి రాగానే పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. కానీ కూటమి అధికారంలోకి రాగానే ఏప్రిల్ నెలతో కలిపి పెన్షన్ అందించాం. సుమారు 65 లక్షల మందికి ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నాం. దివ్యాంగులకు రూ.6000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల చొప్పున అందిస్తున్నాం. గత ప్రభుత్వం 2023 డిసెంబరు నుండి నిలిపివేసిన సుమారు 90వేల మందికి కూడా పెన్షన్లు మంజూరు చేశాం. పెన్షన్ల కోసమే ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత మనదేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *