మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన 2047 విజన్ ప్రణాళికల తయారీపై వివిధ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలుకు జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల వారీగా ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రూపురేఖలు మార్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ రంగాలుగా గుర్తించిన వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఇంచార్జ్ సిపిఓ పద్మజ, డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు షేక్ షాహిద్ బాబు, మార్కెటింగ్ ఏడి నిత్యానంద తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News