నేడు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కు 67.95 శాతం హాజరు

-ఆదివారం ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాలను జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, అలాగే పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో నేటి ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్షలకు మొత్తం 911 మంది అభ్యర్థులకు గాను 619 (67.95 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని, 292 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *