2025-26 ఆర్ధిక సంవత్సరానికి మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా ఋణములు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని మైనారిటీస్ లబ్ధిదారులకు (ముస్లింలు, భౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శికులు) ఎకనామిక్ సపోర్ట్ స్కీం (బ్యాంకబుల్ సబ్సిడీ పధకము) నాలుగు స్లాబ్ లో ఇవ్వడం జరుగును. మొదటి స్లాబ్ క్రింద కిరాణా షాప్, పాన్ షాప్, చికెన్ & మటన్ షాప్, ఫ్రూట్స్ స్టాల్ల్స్, కూరగాయలు అమ్మకం, ఎలక్ట్రికల్ రిపైర్స్, సైకిల్ షాప్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.1.00 లక్ష వరకు; రెండవ స్లాబ్ క్రింద ఎ.సి. & ఫ్రిడ్జ్ రిపైర్స్ వర్క్స్, ఆటోమొబైల్ స్పేర్స్ యూనిట్స్, బాటరీ సర్వీసింగ్ మరియు సేల్స్, సెల్ ఫోన్ రిపైర్స్ & సేల్స్, ఫుట్ వేర్ షాప్స్ అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు వర్కింగ్ కాపిటల్, ఫాషన్ డిజైన్, బ్యూటీ పార్లర్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.1.00 లక్ష నుండి రూ.3.00 వరకు; మూడవ స్లాబ్ క్రింద ఆటోమొబైల్ రంగం, రవాణ రంగం మరియు ఫాబ్రికేషన్ తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకొనుటకు రూ.3.00 నుండి రూ.5.00 లక్షల వరకు మరియు నాలుగవ స్లాబ్ క్రింద ఆటోమొబైల్ రంగం, జనరిక్ మెడికల్ దుకాణాలు మరియు ఫిట్ నెస్ సెంటర్లు ఏర్పాటు రూ.8.00 లక్షల వరకు ఋణ సదుపాయం కల్పించుటకై బ్యాంకుల ద్వారా సబ్సిడీ ఋణముల కొరకు ఆన్ లైన్ ద్వారా అర్హులైన మైనారిటి అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరడమైనది.
అర్హతలు :
– మైనారిటీస్ వర్గాలకు (ముస్లింలు, భౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శికులు) చెందిన వారై ఉండాలి.
– అభ్యర్ధి వయస్సు 21 -55 సంవత్సరముల లోపు ఉండాలి.
– అభ్యర్ధి వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాలకు రూ.1,50,000/- మరియు పట్టణ ప్రాంతాలకు రూ.2,00,000/- లలోపు ఉండాలి.
-తెల్ల రేషన్ కార్డు (కుటుంబములో ఒకరికి మాత్రమే), ఆధార్ కార్డు తప్పనిసరి.
– మొత్తం లక్ష్యంలో 33.1/3% మహిళలకు కేటాయించబడింది.
– అభ్యర్ధి పాస్ పోర్ట్ సైజు ఫోటో -1.
– రవాణ పధకము క్రింద దరఖాస్తు చేసుకునే అభ్యర్దులు తమ డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా జతపరచవలెను.
గుంటూరు జిల్లా నందు అర్హత మరియు ఆశక్తి గల మైనారిటీస్ అభ్యర్దులు తమ దరఖాస్తులను 25-05-2025 లోపు ఆన్ లైన్ apobmms.apcfss.in నందు నమోదు చేసికొని సంబంధిత సర్టిఫికేట్లు జతపరచి సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి / మునిసిపల్ కమీషనర్ కు సమర్పించవలెనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ షేక్ రోషన్ జమీర్ బాషా ఒక ప్రకటనలో కోరినారు. మరిన్ని వివరాలకు ఆఫీస్ పనివేళల యందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్, నగరంపాలెం, గుంటూరు వారిని మరియు 9849901142, 9652960367 సంప్రదించగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *