Breaking News

నూతన కమిటీ ఎన్నిక…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నందు జరిగిన అసోసియేషన్ జిల్లా సమావేశము రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పి. ప్రకాష్ కుమారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆదివారం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డి. శ్రీకాంత్ రాజు హాజరయ్యారు.

రాష్ట్ర అధ్యక్షులు డి. శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ ఐసి.డి.ఎస్ ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని వాపోయారు అంగన్వాడీ లెవెల్ నుండి సూపర్వైజర్లు మరియు ఐ సి డి ఎస్ సిబ్బంది కి appల తో పని భారం చాలా విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. పాత 13 జిల్లాల్లో సూపర్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అలాగే ఐసిడిఎస్ కార్యాలయంలో పీడీ కార్యాలయంలో సిబ్బందిని పూర్తిస్థాయిలో అదనంగా వేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే అనేక అర్జీలు ఇచ్చామని తెలిపారు. 1990 లో ఉన్న సిబ్బంది విదానమే ఇప్పటికి ఉన్నదని, మార్పులు, చేర్పులు, వీధి విధానాలు చేసినారని, వ్యవస్థలు అనేక విభాగాలుగా పెరిగినాయి. కానీ సిబ్బంది పెరగలేదు. అప్పటి కంటే సిబ్బంది తగ్గిపోయినారు. అంగన్వాడి కేంద్రములు మూడు రెట్లు పెరిగాయి. ఐసిడిఎస్ కార్యాలయలు సంఖ్య రెండు రెట్లు పెరిగాయి. పని భారం ఎక్కువగా ఉన్న విషయాలను అధికారులు ప్రభుత్వ పెద్దల తో గట్టిగా చెప్పి ఒప్పించి ఐసిడిఎస్ శాఖలో, ఉద్యోగుల అధికార విభాగంలో మార్పులు తేవాలని కోరారు. అలాగే స్కిం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు భద్రత కల్పించి వారికి ఐసిడిఎస్ శాఖలో కొత్తగా నియామకం జరిగిన పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

పిడి, ఐసిడిఎస్ కార్యాలయాలకు సొంత భవనంలో లేక అద్దె భవనాల్లో పాలన చేయడం అత్యంత కష్టంగా ఉన్నాదని చాలాచోట్ల ప్రభుత్వం ప్రకటించిన రేట్లు కు మార్కెట్ ధరలకు పొంతన లేక పోవడం మన అద్దె భవనాలు కొరకు తెలిపినారు. అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టులకు సొంత భవనాలు నిర్మిందాలని కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భవనాలకు రిపేర్లు లేక కొన్ని భవనాలు ఉన్నాయని వాపోయారు. అందుకు ఐసిడిఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లా పిడి కార్యాలయముకు వాహన సదుపాయాలు కల్పిందాలని కోరారు.

గ్రేడ్ -2 సూపర్వైజర్లు నియామకాలు, గ్రేడ్-2 సూపర్వైజర్లకు పదోన్నతులు, cdpoగా పదోన్నతులు వెంటనే ఇవ్వాలి అని జనరల్ సెక్రెటరీ ప్రకాష్ కుమారి కోరారు. కార్యక్రమంలో వరలక్ష్మి, పద్మ, పెద్ద లక్ష్మి ఝాన్సీ భారతి ఇతర దుర్గామణి శిరీష తదితరులు పాల్గొన్నారు.

ప్రకాష్ కుమారి మాట్లాడుతూ, ఇటీవల rti పేరుతో ఒంగోలుకు చెందిన ప్రైవేటు వర్కర్ ఆధారాలు లేని పిటీషన్ లు పెట్టి అధికారులను మహిళా ఉద్యోగులను బెదిరించి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారని చెప్పారు. అంగన్వాడి పేరుతో మనలో, ఆరాబాక వ్యక్తులలో కలిసి యూనియన్ సమావేశానికి ఉద్యోగులను హాజరు కానివ్వక, హాజరు అయితే వారిపై తప్పుడు ఫిర్యాదులు చేసి గందరగోళం సృష్టించగలమని అసోసియేషన్ సమావేశాలకు హాజరు కావద్దు చేపడాని తీవ్రంగా ఖండిస్తూ నట్లు పేర్కొన్నారు. వారిపై పోలీసు వారికి ఫిర్యాదులు చేస్తామని, కోర్టులో కేసులు కూడా వేస్తామని తెలిపారు. గతకాలంగా మహిళ ఉద్యోగులను వితంతు మహిళా ఉద్యోగులను అధికారులను సిబ్బందిని వేధించి బ్లాక్ మెయిల్ కు పాలు పడుతున్న వ్యక్తులపై పోలీస్ డిజిపి గారిని, మంగళగిరిలో కలిసి కష్టాలని ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. అలాగే ఇప్పటికే వారిపై ఉన్న ఫిర్యాదులకై చర్యలు తీసుకోమని కోరారు. ఐసిడిఎస్ డైరెక్టర్లు సెక్రటరీలు అసోసియేషన్ పరంగా ఇప్పటివరకు సమర్పించిన  విజ్ఞాపన పత్రం పై సత్వరమే పరిష్కారం మార్గాలను చూపించాలని కోరారు. అంగన్వాడి పేరుతో దందాలు నిర్వహించి వికలాంగు పైన మహిళలు పైన ఫిర్యాదులు అక్రమ ఫిర్యాదులు చేస్తున్న వ్యక్తులపై ఏలూరు కలెక్టర్ వారికి ఫిర్యాదులు చేస్తారని, అలాగే మంగళగిరి ఎన్టీఆర్ కార్యాలయంలో గాజువాక ఎమ్మెల్యే వారికి, మరియు పవన్ కళ్యాణ్ ని కలిసి అన్ని విషయములు వినిపిస్తారని ప్రకాష్ కుమారి తెలిపారు. అనంతరం ఉమ్మడి కృష్ణ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *