ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను టి.టి.డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేశారు.
Tags indrakiladri
Check Also
నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం
–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి …