Breaking News

ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి…

 -ఎరువులు, పురుగుమందులు, ఎంఆర్‌పి కన్న అధిక ధరలకు విక్రయించకుండా గట్టి నిఘా…
-గ్రామ మండల స్థాయిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… 
-సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంటల ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహాశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి విజయవాడ డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు రైతులకు అందేందుకు ఈ-క్రాప్ నమోదు ఎంతో ముఖ్యమన్నారు. కౌలు రైతులకు సిసిఆర్ సి కార్డులను త్వరితగతిన జారీ చేసే విషయంలో తహాశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డివిజనల్ పరిధిలోగల మండలాల్లో గత పసలి లో ఇచ్చిన సిసిఆర్ సి కార్డుల సంఖ్యకు ఈ పసలిలో జారీ చేసిన సంఖ్య చేరుకోవడం పట్ల తహాశీల్దార్లును ఆయన అభినందించారు. ఎరువులు, పురుగుమందులు, ఎంఆర్ పి కన్న అధికంగా విక్రయించకుండా గట్టి నిఘా వుంచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో ఆర్ బికేల్లో ఎరువుల ధరలతో కూడిన పట్టికను కూడా ప్రదర్శించాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమీకృత రైతు సహాయ కేంద్రం కాల్ సెంటర్‌ను పటిష్టంగా నిర్వహించాలన్నారు. డివిజన్లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాటబోవు ప్రతి మొక్కకు సంబంధించిన వివిష్టమైన సమాచారం కలిగి వుండాలన్నారు. రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మండల గ్రామ స్థాయిలో ఘనంగా నిర్వహించి పిల్లలో దేశభక్తి పెంచేలా వారికి ఆటలు, పాటలు, పెయింటింగ్, పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి సచివాలయం నందు సంబంధిత సిబ్బంది హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఫీవర్ సర్వేకు ప్రాధాన్యత ఇవ్వలన్నారు. జగనన్న కాలనీల్లో గ్రౌండింగ్, బేస్మెంట్ లెవెల్ లక్ష్యాలను అధిగమించాలన్నారు. రేషన్ నూరు శాతం వినియోగదారులకు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏవో ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్ ఏ తహాశీల్దార్ ఎ రాధిక, డిప్యూటీ తహాశీల్దార్లు సిహెచ్ కుమార్, ఎస్ బేబి సరోజిని, డివిజనల్ స్థాయి, వ్యవసాయ, హౌసింగ్, విద్యా, ఇరిగేషన్, పౌరసరఫరాలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *