మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతము కృష్ణాజిల్లాలో ఉన్న 5.22 లక్షల బియ్యం కార్డులలో, 14.41 లక్షల మంది సభ్యులు ఉండగా, దాదాపు 95% మంది బియ్యం కార్డు లబ్ధిదారులe-KYCచేయించడం ద్వారా రేషన్ కార్డుల డేటాను శుద్ధి చేయడం జరిగినది.
కృష్ణాజిల్లాలోని పౌరులకు మరింత మెరుగైన సేవలను అందించే లక్ష్యాల కొనసాగింపుగా, 07.05.2025 వ తేదీ నుండి జిల్లాలోని గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా బియ్యం కార్డుకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న (7) సేవలను ప్రారంభించడం జరిగినది.
1. కొత్త బియ్యం కార్డుల జారీ
2. బియ్యం కార్డుకు సభ్యుల జోడింపు
3. బియ్యం కార్డు విభజన
4. బియ్యం కార్డు నుండి సభ్యుల తొలగింపు
5. బియ్యం కార్డు సరెండర్
6. బియ్యం కార్డులో చిరునామా మార్పు
7. బియ్యం కార్డులో తప్పు ఆధార్ సీడింగ్ యొక్క దిద్దుబాటు.
ఈ సేవలు గతంలో ఆమోదించబడిన ప్రామాణిక క్రియా విధానాల ప్రకారం మరియు ఇతర శాఖల డేటాబేస్ లతో అనుసంధానం చేసి అందించబడతాయి. కావున, పై (7) రకాల బియ్యం కార్డు సేవలను పొందగోరు పౌరులందరూ వారి ఇంటి సమీపంలోని గ్రామ/వార్డ్ సచివాలయాలలోని సంబంధిత అధికారులకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందించి వారికి కావలసిన సేవలను, వారి యొక్క అర్హతల ప్రకారం పొందవలసినదిగా పత్రికాముఖంగా తెలియజేయడమైనది.
Tags machilipatnam
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News