విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజయవాడ కార్మికశాఖ డిప్యూటి కమిషనరు సిహెచ్. ఆషారాణి చెప్పారు. కోవిడ్ నిబంధనలపై అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలో వివిధ వాణిజ్య సంస్థలను, యుని సెఫ్ ప్రతినిధి శ్రీకాంత్ తదితరులతో కలిసి సందర్శించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో కోవిడ్ కేసులు పెరుగుదల కనిపిస్తున్న దృష్ట్యా అందరూ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా వివిధ మాల్స్, వాణిజ్య దుకాణాల్లో పనిచేసే సిబ్బంది తగు జాగ్రత్తగా ఉండడంతో పాటు వినియోగదారులకు కోవిడ్ పై అవగాహన కలిగించాలన్నారు. మాస్క్ లేనిదే దుకాణాల్లోకి అనుమతించరాదన్నారు. ఎ క్కువమంది ఒకేచోట గుమిగూడకుండా ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని పక్షంలో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం
చర్యలు కూడా తీసుకోబడతాయన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …