విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్యాప్తి చెందే సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల వివరాలనువ తప్పని సరిగా అంతర్జాలంలో నమోదు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటిల్జెన్సుకు చెందిన (సీబిహెచ్ ఐ) బృందం గణాంకాధికారి రామారావు మరియు నందేష్ ప్రసాద్ లు సూచించారు. సీబీహెచ్ ఐ బృందం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివ శంకర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు జాయింట్ కలెర్టరు ఎల్. శివశంకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. యం. సుహాషినిలతో జిల్లాలో వ్యాప్తి చెందుతున్న వ్యాధులు, వాటిని అరికట్టేందుకు వినియోగించే మందులు పై చర్చించారు. జిల్లాలో వ్యాప్తి చెందుతున్న సంక్రమిత, అసంక్రమిత వ్యాధులుతో పాటు మందుల పంపిణీ వివరాలను ప్రతి రోజు అంతర్జాలంలో నమోదు చేయాలని తెలిపారు. సీబీహెచ్ ఐ బృందం వెంట డా. యం.బాబు, డా. సుదర్శన్ బాబు ఉన్నారు.
Tags vijayawada
Check Also
వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 13, 2024 శుక్రవారం నాడు …