రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
“ఆహర నిస్సహయత నివారణ (Zero Hunger) & సరైన ఆరోగ్యం కోసం (Good Health – Well – Being)” తూర్పు గోదావరి జిల్లా “చిన్నారి ఆరోగ్యం ” కార్యక్రమానికి మే 10 శనివారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రము లో శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఈ కార్యక్రమాన్నీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో విజయవంతంగా చేపట్టిన ” బంగారు కొండ ” కార్యక్రమానికి మరింత మెరుగులు దిద్ది చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపకల్పన చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News