విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి విజయవాడ విచ్చేసిన నేషనల్ బి.సి.కమిషన్ వైస్ ఛైర్మన్ డా.లోకేశ్ కుమార్ ప్రజాపతి మరియు మెంబెర్ తల్లోజు ఆచారి ని బుధవారం కలిసి రిజర్వేషన్లు పై 50% సీలింగ్ ఎత్తివేసి కులాల వారి జనగణన చేపట్టి జాబితా ప్రకటించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ పరిమితి దటి ఉన్నత వర్గాలకు EWS 10% ఇస్తున్నారు. కావున గరిష్ట పరిమితి ఎత్తివేసి 2021 జనాభా లెక్కల పట్టికలో బి.సి. జాబితా ని పెట్టి కులాల వారి జనగణనచేసి జాబితా ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, యువజన విభాగం నాయకులు వి.శ్రీనివాసరావు, టి.లీలకృష్ణ, డి.జోసెఫ్, భాను తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …