Breaking News

జిల్లాలోని రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేయాలి… : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు విద్యుత్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం(RDSS), PM KUSUM ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాబియాన్ పథకంలకు సంబంధించి పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలో 381 యొక్క 11 కె.వి అగ్రికల్చర్ ఫీడర్స్ ల నుండి గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన సర్వీసులను వేరుచేయాలని , వ్యవసాయ రంగంలో విద్యుత్ నష్టాలను తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆర్ డి ఎస్ ఎస్ పథకం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్తును సరఫరా చేసే ముఖ్య ఉద్దేశంతో 381 ఫీడర్ లను పూర్తిగా వేరు చేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అన్నారు.

జిల్లాలో 15 సబ్ స్టేషన్ ల కింద 54 ఫీడర్ లలో ఉన్న 6213 వ్యవసాయ పంపు సెట్లకి 142 ఎకరాల ప్రభుత్వ భూములలో పి.ఎం కుసుం ద్వారా 28 మెగా వాట్స్ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రైతులకు పగటిపూట విద్యుత్ ను సరఫరా చేయడం కోసం పీఎం కుసుం పథకంను కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం అమలు కోసం టెండర్ల కు పిలవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 5 డివిజన్ ల పరిధిలోని 33/11 కె.వి స్టేషన్లకి దగ్గరలో ఉన్న 14 ప్రాంతాలను గుర్తించి 142 ఎకరాలను ఇవ్వమని కలెక్టర్ను ఎస్పీడీసీఎల్ వారు అడుగగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ సురేంద్ర నాయుడు, ఈ ఈ లు వాసవి లత, బాలాజీ పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *