విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15 వ డివిజన్, రామలింగేశ్వర నగర్ నందు పుట్ట ప్రాంతంలోని దేవాదాయ భూములలో గత 40 సంవత్సరల నుండి నివాసం ఉంటున్న 50 కుటుంబల వారికి శాశ్వత నివాసం కల్పించాలని కలెక్టర్ నివాస్ గారిని కోరినట్లు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి కలెక్టర్ ని కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ లలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం వలన ఆందోళనకు గురై రోడ్డు మీదకు వచ్చిన బాధితులకు అండగా ఆ రోజు ఏదైతే చెప్పఁమ్మో నేడు ఆ సమస్య పరిష్కారానికి కలెక్టర్ ని కలవడం జరిగిందని, సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …