Breaking News

అబుదాబిలోని బిఎపిఎస్ హిందూ మందిరంలో ఘనంగా వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు

-వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అబుదాబి ఆధ్వర్యంలో వాసవి జయంతి కార్యక్రమం
-ముఖ్య అతిథిగా హాజరైన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) ఆధ్వర్యంలో అబుదాబిలోని బిఎపిఎస్ హిందూ దేవాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య వెల్ఫేర్& డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు నారా లోకేష్ ఆర్యవైశ్య సమాజానికి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించిన విషయాన్ని ఆయన తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం AP NRT కి ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమం వామ్ అబుదాబి అధ్యక్షులు రాజేష్ బైసాని ఆధ్వర్యంలో నిర్వహించారు. యూఏఈ లోని పలు ప్రాంతాల నుండి తెలుగు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *