Breaking News

2019-2022 ఏడాదిల బడ్జెట్ ఎస్టిమేట్స్ పై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన గల ఎస్టిమేట్స్ కమిటీ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమై 2019 నుండి 2022 వరకూ మూడేళ్ళ కాలంలో సాంఘిక,గిరిజన,మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన బజ్డెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించింది. తొలిరోజైన మంగళవారం ఉ.11గం.లకు సాంఘిక సంక్షేమశాఖ,మధ్యాహ్నం 2గం.లకు గిరిజన సంక్షేమశాఖ,3.30.గం.లకు మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖలకు 2019-20,2020-21,2021-22 ఆర్ధిక సంవత్సరాల్లో ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
అలాగే 14వ తేది బుధవారం ఉ.11గం.లకు అసెంబ్లీ కమిటీ హాల్లో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 2019-22 మూడేళ్ళ కాలంలో బడ్జెట్ అంచనాలపై అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షులు వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన గల కమిటీ సమీక్ష నిర్వహించనుంది.
ఈసమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ,డా.పార్ధసారధి, మద్దిపాటి వెంకటరాజు,నిమ్మక జయకృష్ణ,అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్,సాంఘిక, గిరిజన,మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *