విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల పరిరక్షణ హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమలుచేస్తున్న మిషన్ వాత్సల్య మరియు మిషన్ శక్తి స్కీమ్ లపై సమీక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ డి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పద్మావతి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కార్యక్రమలలో బాలల సంరక్షణ కేంద్రాలు అలసత్యం వహిస్తే సహించేదిలేదు అన్నారు. పిల్లలు దత్తత లీగల్ గా జరగాలి. బాల్య వివాహాలు నిషేదించటంలో సంబంధిత అధికారులను భాగ్యస్వాములను చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించలని సూచించారు. లైంగిక బాధితులకు పరిహారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రాస్తుల పిల్లలకు మిషన్ వాత్సల్య గైడెన్స్ ఆధారంగా ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. లైసెన్స్ అర్హత కలిగిన బాలల సంరక్షణ కేంద్రాలు మాత్రమే నడపాలని డీపీవో ను ఆదేశించారు. రిజిస్టర్లు, డాకుమెంటేషన్, రికార్డులు భద్రపర్చుకోవాలని సూచించారు. వన్ స్టాప్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బాలల సంరక్షణ కేంద్రాలలో ఉన్న పిల్లలకు ఐ సి పి, ఎస్ ఐ ఆర్, కేస్ స్టడీ రిపోర్టులు చేయాలని డీసీపీయు సిబ్బందిని ఆదేశించారు. రిస్క్యూ చేసిన బాలలకు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆర్డలు తప్పనిసరిగా ఉండాలిని సూచించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేశ్వరరావు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చేశారు.
ఈ కార్యక్రమం లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ సువార్త, రవి భార్గవ్,డీపీఓ జ్యోతి, సీడీపీఓ లు మంగమ్మ, జోష్న, పుష్పలత, సత్యవతి, కృష్ణ కుమారి, లక్ష్మి భార్గవి, డీసీపీయు, ఓ ఎస్ సి, రైల్వే చైల్డ్ హెల్ప్ లైన్, శిశు గృహ, బాల సదన్, బాలల సంరక్షణ కేంద్రాల సిబ్బంది తదితరుల హాజరయ్యారు.
Prajavartha Online Telugu News