యువత క్రీడాల్లో రాణించాలి క్రీడాస్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలి…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
యువత క్రీడాల్లో రాణించాలి క్రీడాస్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలని భారతీయ జనతా మాజ్దూర్ సెల్ (BJMC )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పట్నం కు చెందిన షేక్ కాలేషా మస్తాన్ ఇంటర్నేషనల్ ఇండో నేపాల్ కప్ 2025 క్రికెట్ అండర్ 23 నేపాల్ లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ కు ఇండియా నుంచి ఆడేందుకు ఎంపికైన సందర్బంగా ఈ రోజు ఒంగోలు సిటీ లోని హోటల్ సర్వర్ లో షేక్ కాలేషా మస్తాన్ ను అభినందిస్తూ చిరు సాత్కారం చేసిన షేక్ ఖలీఫా తుల్లా బాషా. ఈ సందర్బంగా మాట్లాడుతూ షేక్ కాలేషా మస్తాన్ కు ఏటు వంటి సహాయ సహకారాలు కావాలన్న తాను సహకరిస్తానని అండగా ఉంట్టానని హామీ ఇచ్చారు. నేపాల్ లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ లో ఇండియా తరుపున బాగా అడి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమం లో భారతీయ జనతా మాజ్దూర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ సిద్ధాంబీ, ప్రముఖ కరాటే మాస్టార్ షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *