Breaking News

ప్రభుత్వం ఇచ్చే కుల ధృవీకరణ పత్రాల్లో మరియు గ్రామ సచివాలయ ఎంట్రీల్లో ‘‘ఓసీ వైశ్య’’ ని ఆర్యవైశ్య గా మార్చండి

– ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ వినతి
– సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నమెంటు వారు విధి, విదానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు / కుల గణనలను బట్టి ఉన్న ఆర్య వైశ్యులను వైశ్య/శెట్టి / గుప్త / కోమటి / లాగా వివిధ వర్గాల వారుగా విభజించి చూపడం వలన రాష్ట్రంలో గవర్నమెంటు వారు నిర్వహించే అన్ లైన్ వెబ్ సైట్ లలో, యాప్ లలో కూడా ఆర్య, వైశ్యులను వివిధ వర్గాలుగా చూపించడం జరుగుతోంది. ముఖ్యంగా, మండల రెవెన్యూ అధికారులు ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలలో కూడా ” ఒ.సి. వైశ్య ” అని మాత్రమే వస్తుంది. అందువలన ఆర్యవైశ్య వర్గాల వారు ఒకవిధమైన తికమకకు గురిఅగుచున్నారు. కావున గవర్నమెంటు వారి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఉన్నవారిని, భవిష్యత్తులో జరగబోయే ” కుల గణన” విషయంలో గాని యాప్లలో గాని, ఆన్ లైన్ సైట్లలోగాని ఒకే వర్గంగా అదీ ” ఆర్య వైశ్య” అనే విధంగానే ఉండేటట్లు చూడవలసినదిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ విన్నవించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *