Breaking News

సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కేంద్రాలను సిద్ధంగా ఉంచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి, ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు.

ఈనెల 19 నుండి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహణ..
జిల్లాలో పదవతరగతి, ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలలో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్ధానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పదవ తరగతి, ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలకు 6149 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం 30 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు మే, 19వ తేదీ నుండి 24 వతేదీ వరకు జరుగుతాయని, ఈ పరీక్షలలో 1677 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు ప్రతీ పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు లు ఏర్పాటుచేయాలని, వేసవిని దృష్టిలో తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పదవతరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 59 మంది, చీఫ్ సూపరింటెండెంట్ లను, 7 ఫ్లైయింగ్ స్క్వాడ్ లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు 300 మంది ఇన్విజిలేటర్లను నియమించమన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ కు అంతరాయం లేకుండా సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చూడాలన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సెల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. ఆర్ టి సి అధికారులు పరీక్షల సమయాలకు అనుగుణంగా విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలు సిసి కెమేరాల నిఘాలో ఉంటాయన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన భధ్రతా ఏర్పాట్లు చేయాలని డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు.

సమావేశంలో డీఈఓ యు వి సుబ్బారావు, నగరపాలక సంస్థ, విద్యుత్, పోస్టల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *