Breaking News

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి కై మారి టైం బోర్డు చైర్మన్ గా కె.వి.రెడ్డి నియామకం…

-అతి పొడవైన తీరప్రాంతం మారి టైం బోర్డు అభివృద్ధికి విస్తృత అవకాశాలు..
-రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం మారి టైం బోర్డు చైర్మన్‌కు ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మారి టైం బోర్డు ఛైర్మన్ గా నియమితులైన కాయల వెంకట రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం బుధవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటరు నందు నిర్వహించారు. రాష్ట్రమంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పాముల పుష్ప శ్రీవాణి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు కరికాల వలవన్, మారిటైం బోర్డు సిఇఓ మురళీధర్, తదితరులు ఛైర్మన్‌గా కె.వి.రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కొందరికే పరిమితం అయ్యిందన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రజలకోసం పనిచేసిన ప్రతీ ఒక్కరినీ గుర్తుంచుకుని నిష్పక్షపాతంగా కులాలకు అతీతంగా వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి బోర్డు ఛైర్మన్ గా వెంకట రెడ్డిని ఎ ంపిక చేయడమే నిదర్శనం అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి రాణించాలన్నారు. ఏదేశంలోనూ లేనివిధంగా మనరాష్ట్రంలో ఒకేవిడత పేద ప్రజలకు 38 లక్షల ఇళ్లఫలాలు అందించి ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసి గ్రామీణస్థాయి నుండి ప్రాధమిక విద్య పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నానన్నారు.
ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ దేశంలో ఏముఖ్యమంత్రి చేపట్టని విధంగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో 3 పోర్టులు, 6 షిప్ యార్డులు నిర్మాణాలు చేపట్టారని అన్నారు. పరిపాలనలో వినూత్న మార్పులు తీసుకువచ్చి సామాన్యులకు సైతం మంచి హోదాను కల్పిస్తున్న ఘనత సియంకే దక్కుతుందన్నారు. మారి టైం బోర్డు ఛైర్మన్ గా నియమితులైన వెంకట రెడ్డి మంచి పనితీరుతో పేరు తెచ్చుకోవాలన్నారు.
గృహనిర్మాణశాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ 9 జిల్లాల్లో సముద్రతీరం కలిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యసంపద, పోర్టుల అభివృద్ధికి బోర్డు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
బిసి సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ నవరత్నాలుతో పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్లడంతోపాటు అన్ని వర్గాలకు సమన్యాయం ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు.
పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ గతంలో సామాజిక వెనుకబడిన కులాలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో సమన్యాయం చేస్తున్నారన్నారు.
వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పోర్టుల అభివృద్ధి ద్వారా కోస్తా తీరం అభివృద్ధితోపాటు రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. అటువంటి ప్రధానమైన కార్పోరేషన్‌కు వెంకటరెడ్డి వంటి సమర్ధుడును ప్రభుత్వం నియమించిందన్నారు.
దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చాలా ప్రాధాన్యతతో కూడిన మారి టైం బోర్డుకు ఛైర్మన్ గా పదవిబాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) మాట్లాడుతూ గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ తీరప్రాంతం కలిగి ఉందన్నారు. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ పోర్టులున్నాయని వాటి అభివృద్ధితోపాటు తీరప్రాంత అభివృద్ధికి కృషి చేసి వెంకట రెడ్డి తన పదవికి వన్నెతీసుకురావాలన్నారు.
కార్యక్రమంలో జలవనరుల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎ మ్మెల్సి కోలగట్ల వీరభద్రస్వామి, సత్తి సూర్యనారాయణ రెడ్డి, చిర్ల జగ్గి రెడ్డి, శాసనసభ్యులు కైలే అనీల్ కుమార్, పలుకార్పోరేషన్ల చైర్మన్లు డా. శోభాస్వాతి రాణీ గణేష్, కెకె.రాజు, చొక్కాకుల లక్ష్మీ వెంకట్రావు, మేడపాటి షర్మిలారెడ్డి, తదితర కార్పోరేషన్ ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *