Breaking News

ప్రజల వద్దకే పరిపాలన సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందజేస్తూ ప్రజల వద్దకే పరిపాలన ను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం నియోజకవర్గంలోని మొగల్రాజపురం నందు స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదికలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో అవ్వతాతలు పెన్షన్ తీసుకోవాలి అన్నా,ఎవరికైనా ఏదైనా పధకం కావాలంటే కార్యాలయల చుట్టూ కళ్ళారిగెల తిరిగిన పని అయ్యేది కాదని,టీడీపీ నాయకులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, అందులో కూడా మళ్లీ పార్టీలు చూసి తమ పార్టీ వారు అయితేనే అందజేసేవరని విమర్శించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అందజేయడం గాని, అర్హత ఉంటే మరేదైనా పథకం అయినసరే పూర్తి చేస్తున్నారని,దేశంలో మరే ముఖ్యమంత్రి ఇంత జనరంజకంగా పరిపాలన చేయడంలేదని అన్నారు.ఈ డివిజిన్లో దాదాపు 1100 మందికి ఇళ్ల స్థలాలు గాని,1300 మందికి అమ్మఒడి గాని అందజేయడం జరిగిందని,మీరు ఏ నమ్మకం తో అయితే మా వైస్సార్సీపీ కార్పొరేటర్ ను గెలిపించారో నమ్మకం నిలబెట్టుకునే విధంగా మాధురి పని చేస్తున్నారని,మీ ప్రాంత సమస్యలు గురుంచి కౌన్సిల్ లో కూడా ప్రస్తావించారని తెలిపారు. కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజిన్లో చిట్టచివరి ఇంటికి కూడా మంచినీరు అందించేలా పైప్ లైన్ నిర్మాణం గాని,నూతన మెట్లు, రైలింగ్,సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణలు పూర్తి చేసి అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వానిదే అని భరోసా ఇచ్చారు. అర్హులైన వారికి పథకాలు అందజేయాలి అనే లక్ష్యం తో నియమ నిబంధనలు కఠిన తరం చేసారని ఒకవేళ మీకు అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వలన లబ్ది పొందకపోతే ఈ పరిష్కార వేదికలో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, దుర్గ గుడి డైరెక్టర్ సుజాత, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇన్ ఛార్జ్ లు, డివిజన్ నాయకులు సంపత్, కుటుంబరావు, క్లైవ్, సొంగ రాజ్ కమల్,ప్రేమలత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *