-పట్టణంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్దఎత్తున జగనన్న పచ్చతోరణం నిర్వహిస్తాం…
-మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దాతలు ,స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుడివాడ పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్నఅన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలో పెద్ద ఎత్తున జగనన్న పచ్చతోరణం పథకాన్ని ప్రారంబించడం జరగుతుందని మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ అన్నారు. గురువారం గుడివాడ పట్టణంలో నిర్వహించే పలు అంశాలపై మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఉన్న 34 వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిర్ణీత సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆయా వార్డు సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించే సమయంలో తప్పులు చేస్తే మొదటి హెచ్చరించడం జరుగుతుందన్నారు. పదేపదే నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తే మాత్రం సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. పట్టణంలో పర్యావరణ సమతుల్యత, కాలుష్యనివారణే లక్ష్యంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం లో భాగంగా దాతలు స్వచ్చంద సంస్థలు సహకారంతో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాలీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంబిస్తామని కమీషనర్ సంపత్ కుమార్ తెలిపారు.